Atchannaidu: ఎన్నికలు ముగిశాక జగన్ లండన్ పారిపోతాడు: అచ్చెన్నాయుడు

Atchannanidu says Jagan will flee to London after elections
  • కల్యాణదుర్గంలో ఈనాడు విలేకరిపై దాడిని ఖండిస్తున్నట్టు అచ్చెన్న ప్రకటన
  • జర్నలిస్టు రమేశ్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని వెల్లడి
  • అధికారంలోకి వచ్చేది కూటమేనని ధీమా

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈనాడు విలేకరి రమేశ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనాడు జర్నలిస్టు రమేశ్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. 

కూటమి ప్రభుత్వం రాగానే జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు, మీడియాపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారం పోతోందన్న అక్కసుతోనే వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. 

ఎన్నికలు ముగిశాక జగన్ లండన్  పోరిపోతాడని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమేనని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News